Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తాజ్‌పూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. మహిళలతో కలిసి సందడి చేసిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్.

Updated : 18 Oct 2026 21:38 IST
As Preferred Source 1 min read
తాజ్‌పూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. మహిళలతో కలిసి సందడి చేసిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్.

భువనగిరి, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు భువనగిరి మండలం తాజ్‌పూర్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మహిళలు సంప్రదాయబద్ధంగా పూజించి, ఆటపాటలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటల్లో పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలను ఎంపిక చేసి మహిళలకు బహుమతులు అందజేశారు.

అనంతరం సర్పంచ్ సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలంతా ఐక్యంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి