మునగాల మండల కేంద్రంలోని భవానీనగర్ ఏర్పాటు చేసిన దుర్గామాత కనకదుర్గ అవతారంలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా బెజవాడ గోవర్ధన్ – నరసమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం సుమారు 1,500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు.
భవానీనగర్లో కనకదుర్గమ్మగా దుర్గామాత దివ్య దర్శనం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి