Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

పూల పండుగలో సృజనాత్మకత..! తులసి కోట ఆకారంలో బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.

Updated : 18 Oct 2026 21:43 IST
As Preferred Source 1 min read
పూల పండుగలో సృజనాత్మకత..!  తులసి కోట ఆకారంలో బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.

చంపాపేట, అక్టోబర్ 18: బతుకమ్మ సంబరాల్లో వినూత్న ఆలోచనతో రూపొందించిన తులసి కోట ఆకారపు బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవ్ నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు తులసి కోట ఆకృతిలో బతుకమ్మను పేర్చి తమ సృజనాత్మకతను చాటుకున్నారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో తులసి కోట బతుకమ్మను అందంగా తీర్చిదిద్దారు. కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వినూత్నంగా రూపొందించిన బతుకమ్మను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. మహిళల సమష్టి కృషి, సృజనాత్మకతను స్థానికులు అభినందించారు.

Sthanikam

పూల పండుగలో సృజనాత్మకత..! తులసి కోట ఆకారంలో బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.

Article Image

చంపాపేట, అక్టోబర్ 18: బతుకమ్మ సంబరాల్లో వినూత్న ఆలోచనతో రూపొందించిన తులసి కోట ఆకారపు బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవ్ నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు తులసి కోట ఆకృతిలో బతుకమ్మను పేర్చి తమ సృజనాత్మకతను చాటుకున్నారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో తులసి కోట బతుకమ్మను అందంగా తీర్చిదిద్దారు. కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వినూత్నంగా రూపొందించిన బతుకమ్మను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. మహిళల సమష్టి కృషి, సృజనాత్మకతను స్థానికులు అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news