మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు, యువతులు ఉత్సాహంగా నిర్వహించారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. పండుగ వాతావరణంతో గ్రామాలు సందడిగా మారాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకలతో గ్రామాల్లో పండుగ శోభ వెల్లివిరిసింది.
మునగాల మండలంలో పూల పండుగ సందడి.. ఘనంగా సద్దుల బతుకమ్మ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి