Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

దుర్గమ్మ ఉత్సవాలకు శాశ్వత వేదిక ఏర్పాటు చేస్తా. శివాజీ యూత్‌కు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ హామీ.

Updated : 19 Oct 2026 06:40 IST
As Preferred Source 1 min read
దుర్గమ్మ ఉత్సవాలకు శాశ్వత వేదిక ఏర్పాటు చేస్తా. శివాజీ యూత్‌కు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ హామీ.

భోగారం, అక్టోబర్ 19: గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ దుర్గాదేవి 15వ వార్షిక శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఉత్సవాల నిర్వహణకు శివాజీ యూత్‌కు శాశ్వత వేదిక (పర్మనెంట్ స్టేజ్) ఏర్పాటు చేసేందుకు సర్పంచ్ సాయికుమార్ గౌడ్ దాతగా ముందుకు వచ్చారు. దీంతో శివాజీ యూత్ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, శివాజీ యూత్ సభ్యులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి