ఆసరా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాలనీ మహిళలు, ప్రజలు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 13వ వార్డు పరిధిగల క్రిష్ణానగర్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగాయి. క్రిష్ణానగర్ ఆసరా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒకచోట చేర్చి, మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు, కోలాటాలతో జానపద గేయాలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. నిష్టతో తయారు చేసిన సద్దుల (నైవేద్యాల)ను ఒకరికొకరు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమంలో ఆసరా యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి