Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Updated : 19 Oct 2026 06:42 IST
As Preferred Source 1 min read
అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్ నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. విదేశీ గడ్డపై కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ... ఎక్కడ ఉన్నా మన సంస్కృతే మన గుర్తింపు, మన సంప్రదాయాలే మన ఆత్మగౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తూ, మన సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తున్న తెలుగు ప్రజలను ఆమె అభినందించారు.

Sthanikam

అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Article Image

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్ నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. విదేశీ గడ్డపై కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ... ఎక్కడ ఉన్నా మన సంస్కృతే మన గుర్తింపు, మన సంప్రదాయాలే మన ఆత్మగౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తూ, మన సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తున్న తెలుగు ప్రజలను ఆమె అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news