Sthanikam - Truth Matters
Logo

నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు

Updated : 19 Oct 2026 13:32 IST
As Preferred Source 1 min read
నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.

నల్లగొండ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలను ఘనంగా నిర్వహించారు. ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధాలకు, ఎం.టీ. విభాగంలో పోలీస్ వాహనాలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి