Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం

Updated : 19 Oct 2026 14:42 IST
As Preferred Source 1 min read
పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం

సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డులో కాంగ్రెస్ నాయకులు పట్టభద్రులను కలుసుకుని ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రులను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎలగబోయిన మధు యాదవ్, సింగం నరేష్, పల్లపు భాస్కర్, నామ రాజశేఖర్, ఎల్లంల లింగయ్య, నల్లమేకల మన్సూర్, ఎడ్ల శివ, ఎడ్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి