అతివేగంతో అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లిన వాహనం.. ముగ్గురికి స్వల్ప గాయాలు
సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. కారు పల్టీలు కొట్టడంతో వారు గాయపడినప్పటికీ, అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఘటనను గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి