సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని దోసపల్లి గ్రామంలో సోమవారం బాలాజీ అనురాధ ఆసుపత్రి, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిరధర్ దత్తు సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు గ్రామస్తులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, కరణ్ మెడికల్ యజమాని అమృత్ సహకారంతో అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్, బెల్లాపూర్ సర్పంచ్ కె. దిగంబర్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రభాకర్,డీలర్ అశోక్,నారాయణతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ అనురాధ ఆసుపత్రి ఆధ్వర్యంలో దోసపల్లిలో ఉచిత వైద్య శిబిరం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి