Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Updated : 19 Oct 2026 18:51 IST
As Preferred Source 1 min read
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో కౌన్సిలర్ కొత్త గొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే పూల పండుగ అని అన్నారు. హనుమాన్ నగర్‌లోని హనుమాన్ మందిరం నుంచి డప్పు వాయిద్యాల నడుమ బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి దుర్గమ్మ, పోచమ్మ మందిరం ఆవరణలో సంబరాలు నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన కౌన్సిలర్ సోమశేఖర్‌ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు, యువతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో కౌన్సిలర్ కొత్త గొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే పూల పండుగ అని అన్నారు. హనుమాన్ నగర్‌లోని హనుమాన్ మందిరం నుంచి డప్పు వాయిద్యాల నడుమ బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి దుర్గమ్మ, పోచమ్మ మందిరం ఆవరణలో సంబరాలు నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన కౌన్సిలర్ సోమశేఖర్‌ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు, యువతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి