సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి గుడిమే హన్మంతు కుటుంబ సభ్యులు (ఎంఎస్డీ చిట్ ఫండ్స్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 25 అడుగుల రేకుల షెడ్డును ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు.జాతర సమయంలో ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా ఈ షెడ్డు నిర్మించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు గుడిమే హన్మంతు కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప,ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్ధు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, ఆలయ మాజీ చైర్మన్ మల్లయ్య, ఆలయ బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించిన గుడిమే హన్మంతు కుటుంబ సభ్యులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి