గురుకులాలు, హాస్టళ్లలో నిత్యావసర సరుకుల కొరతను పరిష్కరించాలి
ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ డిమాండ్.
నల్లగొండ: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో నిత్యావసర సరుకుల సరఫరా సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ డిమాండ్ చేశారు. సరఫరా లోపాల కారణంగా పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళనకరమన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి