Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను కలిసిన బొంగు మనోజ్ గౌడ్

Updated : 19 Oct 2026 20:53 IST
As Preferred Source 1 min read
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను కలిసిన బొంగు మనోజ్ గౌడ్

టీజీవైఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడికి శాలువాతో సత్కారం

గౌడ జాతి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా: మనోజ్ గౌడ్

తెలంగాణ గౌడ యువజన సంఘం (టీజీవైఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు బొంగు మనోజ్ గౌడ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.​జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం తొలిసారిగా మాజీ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన మనోజ్ గౌడ్.. ఆయనకు పూలబొకే అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్‌ను మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మనోజ్ గౌడ్ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ, గౌడ సామాజిక వర్గ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తున్న ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కడంతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు.ఈ సందర్భంగా బొంగు మనోజ్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన టీజీవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల సహకారంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం, గ్రామంలో కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గౌడ కులస్తులకు అందిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, గౌడ జాతి ఆత్మగౌరవం, గీత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ గౌడ సంఘం పెద్దలు, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను కలిసిన బొంగు మనోజ్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి