విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘సర్కార్ ధర్మ జెండా’ను ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ధర్మ జెండాను ఎగురవేసి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, కుల పెద్దలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ‘అలాయ్ బలాయ్’ నిర్వహించి పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి