Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

దసరా వేడుకల్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యం: ఎస్సై సంజీవరెడ్డి

Updated : 20 Oct 2026 07:02 IST
As Preferred Source 1 min read
దసరా వేడుకల్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యం: ఎస్సై సంజీవరెడ్డి

మునగాల మండల ప్రజలు దసరా పండుగను సంతోషంగా, ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సంజీవరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగతో పాటు దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలు, ఊరేగింపుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ తగిన భద్రతా చర్యలు చేపడుతుందని తెలిపారు.పండుగ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా, నిబంధనలు పాటిస్తూ పండుగ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దసరా పండుగను ఐకమత్యంతో, సోదరభావంతో జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని ఎస్సై సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

దసరా వేడుకల్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యం: ఎస్సై సంజీవరెడ్డి

Article Image

మునగాల మండల ప్రజలు దసరా పండుగను సంతోషంగా, ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సంజీవరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగతో పాటు దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలు, ఊరేగింపుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ తగిన భద్రతా చర్యలు చేపడుతుందని తెలిపారు.పండుగ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా, నిబంధనలు పాటిస్తూ పండుగ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దసరా పండుగను ఐకమత్యంతో, సోదరభావంతో జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని ఎస్సై సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి