Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఆపద్బాంధవుడు రాజగోపాల్‌ రెడ్డి..​నేషనల్స్‌కు ఎంపికైన పేద క్రీడాకారిణి నియోజితకు రూ.50 వేల ఆర్థిక సాయం

Updated : 20 Oct 2026 07:02 IST
As Preferred Source 1 min read
ఆపద్బాంధవుడు రాజగోపాల్‌ రెడ్డి..​నేషనల్స్‌కు ఎంపికైన పేద క్రీడాకారిణి నియోజితకు రూ.50 వేల ఆర్థిక సాయం

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

పేదరికం ఏ ప్రతిభకూ అడ్డుకాకూడదని నిరూపిస్తూ.. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన ఓ నిరుపేద క్రీడాకారిణికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసానిస్తూ తక్షణ సహాయంగా రూ. 50,000 అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.​స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SGFI) ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ వేదికగా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేషనల్స్‌కు చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డుకు చెందిన నిరుపేద విద్యార్థిని నియోజిత ఎంపికైంది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండడంతో పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులు భరించే స్థోమత లేక ఆ కుటుంబం ఆందోళన చెందింది.

​ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్‌ ఉడుగు జ్యోతి రమేష్‌ గౌడ్‌ గుర్తించి, వెంటనే స్పందించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాకారిణి ప్రతిభను, కష్టాలను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి రూ. 50,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

​సమయానికి ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి, సహాయం అందించడంలో చొరవ చూపిన కౌన్సిలర్‌ ఉడుగు జ్యోతి రమేష్‌ గౌడ్‌కు నియోజిత తల్లిదండ్రులు, స్థానిక క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సాయం తన విజయానికి తొలి మెట్టు అవుతుందని క్రీడాకారిని నియోజిత ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి