శోభాయాత్రను విజయవంతం చేయండి: గోలి నరేష్
వెలిమినేడు: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి గోలి నరేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అలాగే రేపు నిర్వహించనున్న దుర్గాదేవి అమ్మవారి శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గోలి నరేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మాలధారణలో ఉన్న స్వాములు ఉమ్మెత్తల శివకుమార్, జినుకల వివేక్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి