హాజరైన విహెచ్‌పి ఉమ్మడి నల్గొండ జిల్లా సంఘటన మంత్రి గోగు రవి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రఖండ్ పరిధిలోని గోకారం, జాలుకాలువ గ్రామాలలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బజరంగ్ దళ్ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర విజయదశమి సందర్భంగా ధర్మ రక్షణే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి, యువకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ఉమ్మడి నల్గొండ జిల్లా సంఘటన మంత్రి, బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు, యువతలో దేశభక్తి, ధర్మ చైతన్యాన్ని పెంపొందించడానికి బజరంగ్ దళ్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, యువత సంఘటితమై ధర్మ మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ బజరంగ్ దళ్ కార్యకర్తలు, స్థానిక యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. ధ్వజ ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి