హాజరైన విహెచ్‌పి ఉమ్మడి నల్గొండ విభాగ్ సంఘటన మంత్రి వెంకట్, జిల్లా సంయోజక్ గోగు రవి
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రఖండ్ పరిధిలోని గోకారం, జాలుకాలువ గ్రామాల్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధ్వజావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహపూరిత వాతావరణంలో ధ్వజావిష్కరణ చేపట్టారు.ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ఉమ్మడి నల్గొండ విభాగ్ సంఘటన మంత్రి కన్నెబోయిన వెంకట్ జీ, బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా సంయోజక్ గోగు రవి జీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మ పరిరక్షణకు, సమాజంలో ఆధ్యాత్మిక, దేశభక్తి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో స్థానిక యువకులు బాలకృష్ణ, బాల నర్సింహా, ప్రవీణ్, శివ, నవీన్, మనోజ్, మణికంఠ, కిరణ్, బాలాచారి, వినయ్, రాహుల్, భాస్కర్, శివమణి, శివ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి