Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

లైసెన్స్‌డ్ గన్‌తో జింకల వేట! హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్‌.. ఆయుధాలు, వాహనం స్వాధీనం.

Updated : 21 Oct 2026 06:12 IST
As Preferred Source 1 min read
లైసెన్స్‌డ్ గన్‌తో జింకల వేట! హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్‌.. ఆయుధాలు, వాహనం స్వాధీనం.

మలక్‌పేట, అక్టోబర్ 21: లైసెన్స్‌డ్ తుపాకీతో కర్ణాటక అడవుల్లో జింకల వేటకు వెళ్లిన ముగ్గురిని మలక్‌పేట, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తుపాకీ, బుల్లెట్లు, నైట్‌ విజన్‌ టెలిస్కోప్‌లు, స్కార్పియో వాహనంతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

12 రౌండ్లు కాల్పులు

పోలీసుల వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహమ్మద్ హమీద్ ఈ నెల 18న స్కార్పియో వాహనంలో కర్ణాటకలోని కలబురిగి జిల్లా చించోలి తాలూకా చిమ్మన్‌చోడ్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జింకల వేటకు ప్రయత్నిస్తూ తమ వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో 12 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఎలాంటి జంతువులు లభించలేదు.

అనంతరం ఈ నెల 19న సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు రేస్‌కోర్సు సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

భారీగా వస్తువుల స్వాధీనం

నిందితుల నుంచి ఒక స్పోర్టింగ్ రైఫిల్, 8 సజీవ బుల్లెట్లు, 12 ఖాళీ బుల్లెట్ కోశాలు, మూడు నైట్‌ విజన్‌ టెలిస్కోప్‌లు, ఆయుధ లైసెన్స్‌, స్కార్పియో వాహనం, దెబ్బతిన్న మడత ఫోన్‌తో పాటు మరో నాలుగు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వన్యప్రాణుల వేటకు సంబంధించిన అంశాలతో పాటు ఆయుధ లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఆధారాలను తొలగించేందుకు మొబైల్ ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. నిందితులను మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

లైసెన్స్‌డ్ గన్‌తో జింకల వేట! హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్‌.. ఆయుధాలు, వాహనం స్వాధీనం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి