నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం నారాయణఖేడ్ మున్సిపల్ కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు నాథన్ డ్యాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. పండరి, జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, అంబేద్కర్ భవన్ ఇన్‌చార్జి భీమసేన, న్యాయవాది జీవన్, బీఎస్పీ నాయకులు పండరి, రవీందర్, యేసు రత్నం తదితరులు నాథన్ డ్యానిని శాలువాతో ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నాథన్ డ్యాని జన్మదిన వేడుకల్లో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి