పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ గోపాతి సతీష్ సిరిపురం గ్రామానికి చెందిన హోంగార్డు కూరెళ్ల ఉపేంద్రచారి (ఎస్‌జీ నంబర్ 987) చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, మోదాల సురేష్, హోంగార్డు రవి తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి. హోంగార్డు కూరెళ్ల ఉపేంద్రచారికి రామన్నపేట ఎస్‌ఐ నివాళి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి