Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

స్వర్ణగిరిలో పవిత్రోత్సవాల వైభవం!

Updated : 21 Oct 2026 20:00 IST
As Preferred Source 1 min read
స్వర్ణగిరిలో పవిత్రోత్సవాల వైభవం!

22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు

వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్న స్వర్ణగిరీశుడు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 21: యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజలు, హోమాలు, పవిత్ర సమర్పణలు, వాహన సేవలతో ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు, చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ, గోపీకృష్ణ కోరారు.

ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు

ఈ నెల 22న స్నపన తిరుమంజనం, సూర్యప్రభ, పెద్ద శేష వాహన సేవలు నిర్వహించనున్నారు. 23న వేద పారాయణం, గజ, హనుమంత వాహన సేవలు, అంకురారోపణం, పవిత్రాధివాసం జరగనున్నాయి. 24న పవిత్రాధివాస హోమం, వసంతోత్సవం, కల్పవృక్ష, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు. 25న సహస్ర తులసీనామార్చన, చిన్న శేష, సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి. 26న అష్టోత్తర శతకలశాభిషేకం, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, మహా కుంభప్రోక్షణ, పవిత్ర ప్రధానం, గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

లోక కల్యాణం కోసం పవిత్రోత్సవాలు

ఆలయంలో నిత్యం నిర్వహించే పూజలు, అర్చనలు, కైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ పవిత్రతను పరిరక్షిస్తూ లోక కల్యాణాన్ని ఆకాంక్షించడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. స్వామివారి దివ్య అనుగ్రహంతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్య మంగళ దర్శనం చేసుకోవాలని కోరారు.

Sthanikam

స్వర్ణగిరిలో పవిత్రోత్సవాల వైభవం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news