దేవాదాయ భూముల వ్యవహారంపై విచారణ జరపాలి: జై లోక్‌సత్తా అధ్యక్షుడు మహేష్‌బాబు.
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్రకు ఫిర్యాదు చేసినట్లు జై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేష్‌బాబు తెలిపారు.గ్రామ పరిధిలోని దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ఉన్న నక్ష బాటను సీసీ రోడ్డుగా మార్చేందుకు చేసిన తీర్మానాలు, చేపట్టిన పనులు, వాటికి సంబంధించిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో కోరినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి పాత్రపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు మహేష్‌బాబు వెల్లడించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి