నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాపూర్ దుర్గా భవాని అమ్మవారి దర్శనం కోసం సుమారు 150 నుంచి 200 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తులు భక్తిశ్రద్ధలతో పయనమయ్యారు. అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికి తుల్జాపూర్ చేరుకుని అమ్మవారిని దర్శించుకోనున్నట్లు భక్తులు తెలిపారు. దర్శనం అనంతరం తిరిగి కంగ్టికి చేరుకోనున్నారు. ప్రతి సంవత్సరం భక్తులు పాదయాత్రగా అమ్మవారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రతో కంగ్టి మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అమ్మవారి దర్శనమే లక్ష్యంగా 200 కిలోమీటర్ల పాదయాత్ర
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి