ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్సై మల్లు సంజీవరెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మునగాల ఎంజీఎల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మునగాలలోని ప్రభుత్వ వైద్యశాల నుంచి పోలీస్ స్టేషన్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎల్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ నరసింహారావు, సభ్యులు తాటికొండ శ్రీనివాస్, పసుపులేటి వెంకన్న, బి గోవర్ధన్, కందిబండ హరీష్, ఎస్ గోపి, మునగాల గ్రామ యువకులు పురుషోత్తం బాబు, జానీమియా, వేట అశోక్, గడ్డం వినోద్, పసుపులేటి సందీప్, ముత్యాల యశ్వంత్, తంగేళ్ల సందీప్, అనంతుల శివ, దేవరం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు..
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి