విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డు అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో భాస్కర్ థియేటర్ ఎదురుగా మంగళవారం రాత్రి రావణ దహన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రావణ దహనం కావించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్‌కుమార్ మాట్లాడుతూ... ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తాము చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వార్డు ప్రజలకు జమ్మి ఆకులను పంచుతూ ఒకరికొకరు ఆప్యాయంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రజలు అలాయ్ బలాయ్ చేసుకుంటూ, టపాకాయలు కాల్చి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి