నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం సేవలు అందిస్తున్నారని, పండుగలు, సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నారని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవి గౌడ్‌తో పాటు పోలీస్ సిబ్బంది, శంకర్ డీలర్, శివాజీ పటేల్, దేవిదాస్, చంద్రకాంత్ సార్ తదితరులు పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు.
అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సర్పంచ్ కృష్ణ ముదిరాజ్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి