ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భువనగిరి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 14న భువనగిరిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, సుమారు 400 మందికి వివిధ రకాల మధుమేహ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (FBS), పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ (PLBS), హెచ్‌బీఏ1సీ (HbA1c) తదితర పరీక్షలు చేశారు. మధుమేహ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, వ్యాయామం, ప్రతిరోజూ నడక, మందుల వినియోగం, ఇన్సులిన్ ఇంజెక్షన్ల వాడకంపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఐఎంఏ భువనగిరి శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఈ. బలరామ్, కార్యదర్శి డాక్టర్ ఎన్. అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను భవిష్యత్తులో విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ వైద్య శిబిరంలో అజయ్ హాస్పిటల్, ఈబీఆర్ హాస్పిటల్, ఆర్‌కే హాస్పిటల్, కేఎంఆర్ హాస్పిటల్, ప్రశాంత్ హాస్పిటల్, ఇందిరా హాస్పిటల్, తిరుమల హాస్పిటల్, రూమీ హాస్పిటల్, అల్చింగ్ ప్రశాంత్ హాస్పిటల్, రెడ్డి హాస్పిటల్ తదితర ఆసుపత్రుల వైద్యులు, ప్రతినిధులు పాల్గొని సేవలందించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి