Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గోదాముల్లో స్థలాభావం.. రైస్ మిల్లర్లకు ఆర్థిక కష్టాలు! బియ్యం దిగుమతుల్లో జాప్యాన్ని నివారించాలి.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – గౌరిశెట్టి అశోక్

Updated : 15 Nov 2026 04:49 IST
As Preferred Source 1 min read
గోదాముల్లో స్థలాభావం.. రైస్ మిల్లర్లకు ఆర్థిక కష్టాలు! బియ్యం దిగుమతుల్లో జాప్యాన్ని నివారించాలి.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – గౌరిశెట్టి అశోక్

ప్రభుత్వ గోదాముల్లో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా స్థలం అందుబాటులో లేకపోవడం, ఇప్పటికే ఉన్న నిల్వలను సకాలంలో ఖాళీ చేయకపోవడంతో రైస్ మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ట్రెజరర్ గౌరిశెట్టి అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.

గోదాముల్లో స్థలాభావం కారణంగా మిల్లింగ్ పూర్తయిన బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి అప్పగించలేకపోతున్నామని, ఫలితంగా మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో ధాన్యం రంగు మారడం, బియ్యం నాణ్యత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

నిల్వలు పేరుకుపోవడంతో మిల్లుల్లో స్థలం సరిపోక పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మిల్లులు పనిచేయకపోయినా కార్మికుల వేతనాలు, విద్యుత్ కనీస చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు తప్పనిసరిగా భరించాల్సి వస్తోందని వివరించారు. తిరిగి మిల్లింగ్ ప్రారంభించే క్రమంలో విలువైన పని సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి