ఆటపాటలు, విభిన్న వేషధారణలతో సందడి చేసిన విద్యార్థులు.
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నేరడ స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలో భాగంగా బాలల సభను ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మిరియాల వెంకటేశం, గ్రామ కార్యదర్శి సీహెచ్ సరిత హాజరయ్యారు. విద్యార్థులు విభిన్న వేషధారణలతో అలరించడంతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మిరియాల వెంకటేశం మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి చెట్లను పెంచాలని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వల్లం నాగరాజు, ఉపాధ్యాయులు పి. హేమలత, రంగ రామలింగయ్య, పోషం లింగస్వామి, వాలంటీర్ సుమలత, ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ లావణ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి