Sthanikam - Truth Matters
Logo

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ సందడి

Updated : 15 Nov 2026 08:23 IST
As Preferred Source 1 min read
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ సందడి

విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ప్రదర్శించడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయ వంటకాలతో పాటు రుచికరమైన చిరుతిళ్లు, పండ్లతో తయారుచేసిన ఆహార పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి అయిన నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. పిల్లలంటే ఎంతో ప్రేమ చూపిన నెహ్రూను చిన్నారులు ఆప్యాయంగా చాచా నెహ్రూ అని పిలిచేవారని గుర్తుచేశారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధిపై సమాజంలో అవగాహన కల్పించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమన్నారు.

ఫుడ్ ఫెస్టివల్ కేవలం రుచుల పండుగ మాత్రమే కాదని, విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఐక్యత, స్వతంత్రంగా పనులు చేసుకునే నైపుణ్యాలను పెంపొందించేందుకు చక్కని వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వివిధ ఆహార పదార్థాల తయారీ, వాటిలోని పోషక విలువలు, పరిశుభ్రత, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.

పుస్తక జ్ఞానంతో పాటు నిత్యజీవితానికి అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో పాటు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ సందడి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి