Sthanikam - Truth Matters
Logo

కొడంగల్‌కే కాదు.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలనూ అభివృద్ధి చేయాలి

Updated : 15 Nov 2026 17:50 IST
As Preferred Source 1 min read
కొడంగల్‌కే కాదు.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలనూ అభివృద్ధి చేయాలి

నకిరేకల్‌కు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలి : బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని ఆదివారం బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు, అడ్వకేట్ గుండాల నరేష్ గౌడ్ సందర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లిలో పర్యటించి, తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడంపై ఆయన స్పందించారు.

ముఖ్యమంత్రి తన సొంత గ్రామాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తప్పులేదని, అయితే ఆయన ఒక్క కొడంగల్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి కూడా రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

కొడంగల్‌కే కాదు.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలనూ అభివృద్ధి చేయాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి