Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

శివదీక్ష స్వాములకు భక్తిశ్రద్ధలతో అన్నదానం ​నిర్వహించిన పల్లె గోవర్ధన్ రెడ్డి – సౌమ్య దంపతులు

Updated : 15 Nov 2026 21:55 IST
As Preferred Source 1 min read
శివదీక్ష స్వాములకు భక్తిశ్రద్ధలతో అన్నదానం ​నిర్వహించిన పల్లె గోవర్ధన్ రెడ్డి – సౌమ్య దంపతులు

దంపతులకు శివ స్వాముల ఆశీస్సులు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో గల శ్రీ మోక్షలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాస శివదీక్ష చేపట్టిన స్వాములకు పల్లె గోవర్ధన్ రెడ్డి – సౌమ్య దంపతులు ఆదివారం భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా శివదీక్ష స్వాములు మాట్లాడుతూ.. కార్తీకమాసంలో శివదీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని పేర్కొన్నారు. భక్తిభావంతో అన్నదానం నిర్వహించిన గోవర్ధన్ రెడ్డి – సౌమ్య దంపతులపై పరమశివుడి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.​ఈ కార్యక్రమంలో గురుస్వామి ఆదిమూలం శంకర్, వీరమల్ల దాసు గౌడ్, కుక్కల నరసింహ, జూలు శంకరయ్య, గోగులోతు శంకర్ నాయక్, దోర్నాల గజేందర్, కందగట్ల శ్రీను, ముప్పిడి కృష్ణ చైతన్య, ఇట్టగొని విగ్నేష్, పున్న శివ, భీమనగొని బాల శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి