స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని చౌటుప్పల్ పురపాలక 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమంలో భాగంగా 13వ వార్డు పరిధిలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు చెత్తబుట్టలు, మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని, ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్తబుట్టల్లో సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వర్కాల వెంకట్ కుమార్ గౌడ్, నాయకులు తొర్పునూరి బాబు గౌడ్, చేవగోని వెంకటేష్ గౌడ్, చెరుకు శ్రీను గౌడ్, మున్సిపల్ సిబ్బంది,13వ వార్డు మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి