Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

గంటలోపే తప్పిపోయిన బాలుడి ఆచూకీ గుర్తింపు. వనస్థలిపురం పోలీసుల చాకచక్యం.. తల్లికి సురక్షితంగా అప్పగింత.

Updated : 18 Oct 2026 15:00 IST
As Preferred Source 1 min read
గంటలోపే తప్పిపోయిన బాలుడి ఆచూకీ గుర్తింపు.  వనస్థలిపురం పోలీసుల చాకచక్యం.. తల్లికి సురక్షితంగా అప్పగింత.

వనస్థలిపురం, అక్టోబర్ 18:

వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ వద్ద తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని వనస్థలిపురం పోలీసులు గంటలోపే గుర్తించి, సురక్షితంగా తల్లికి అప్పగించారు.

వనస్థలిపురం పోలీసుల వివరాల ప్రకారం.. జయంష్ రెడ్డి (4) అనే బాలుడు తప్పిపోయినట్లు అతడి తల్లి లావణ్య పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వెంకటేష్, సుధాకర్, మహిళా పోలీస్ సిబ్బంది ప్రేమలత బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చురుగ్గా వ్యవహరించిన పోలీసులు గంటలోపే బాలుడిని గుర్తించి తల్లి లావణ్యకు క్షేమంగా అప్పగించారు.

తప్పిపోయిన బాలుడిని గంటలోపే గుర్తించి తల్లికి అప్పగించడంలో చొరవ చూపిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news