నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మ కుంట వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పండుగకు హాజరయ్యే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, షారుక్, మహేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తయార్ ఆలీ, కొండల్ రెడ్డి, దత్తు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి