Sthanikam - Truth Matters
Logo

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా స్వచ్ఛభారత్‌.. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Updated : 18 Oct 2026 12:56 IST
As Preferred Source 1 min read
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా స్వచ్ఛభారత్‌.. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

చిట్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్‌

చిట్యాల: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చిట్యాల పట్టణంలో ప్రధానమంత్రి సేవా సంకల్ప అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం శివాలయం ప్రాంతంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పట్టణ పరిశుభ్రతకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ రుద్రవరం లింగస్వామి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 13 ఏళ్లపాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లకు పైగా ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.

Sthanikam

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా స్వచ్ఛభారత్‌.. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి