Sthanikam - Truth Matters
Logo

మఠంపల్లి బ్రిడ్జి వద్ద బోల్తాపడ్డ సిమెంట్‌ ట్యాంకర్‌.. తప్పిన ప్రమాదం

Updated : 18 Oct 2026 11:59 IST
As Preferred Source 1 min read
మఠంపల్లి బ్రిడ్జి వద్ద బోల్తాపడ్డ సిమెంట్‌ ట్యాంకర్‌.. తప్పిన ప్రమాదం

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి బ్రిడ్జి సమీపంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాంకర్‌ రోడ్డుపై బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సహాయంతో బోల్తాపడిన ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Sthanikam

మఠంపల్లి బ్రిడ్జి వద్ద బోల్తాపడ్డ సిమెంట్‌ ట్యాంకర్‌.. తప్పిన ప్రమాదం

Article Image

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి బ్రిడ్జి సమీపంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాంకర్‌ రోడ్డుపై బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సహాయంతో బోల్తాపడిన ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి