Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Updated : 18 Oct 2026 07:12 IST
As Preferred Source 1 min read
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల సీఐ ప్రతాపలింగం సూచించారు. శనివారం మునగాల మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. అలాగే, బతుకమ్మ పండగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

Sthanikam

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Article Image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల సీఐ ప్రతాపలింగం సూచించారు. శనివారం మునగాల మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. అలాగే, బతుకమ్మ పండగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి