సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మునగాల మండల ప్రత్యేక అధికారి మహాలక్ష్మి సమక్షంలో శనివారం మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎల్నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ తాగునీరు అందించడం, నీరు మరియు విద్యుత్ను పొదుపుగా వినియోగించేలా అవగాహన కల్పించడం, వ్యవసాయంలో వరి పంటకు బదులుగా మెట్ట పంటలను ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వి.బి.-జి. రామ్జీ పథకం ద్వారా అర్హులైన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో, తహసీల్దార్,వ్యవసాయ శాఖ అధికారి, మిషన్ భగీరథ ఏఈ, ఇరిగేషన్ ఏఈ, వెటర్నరీ డాక్టర్, ఏపీవో, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
మునగాల మండలంలో ఎల్నినో, కరువు నివారణకు ముందస్తు కార్యాచరణపై అధికారుల సమావేశం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి