నల్గొండ : చండూరు మండలం పుల్లెంల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
విధులు ముగించుకుని శనివారం నల్గొండకు వస్తుండగా ఎస్ఎల్బీసీ సమీపంలోని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చేరుకున్నారు. అంజయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రమాదానికి గల కారణాలను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అంజయ్య కుటుంబ సభ్యులకు కలెక్టర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి, చండూరు ఎంపీడీవో తదితరులు ఉన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి