దాతల సహకారంతో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం
ప్రతిరోజూ పట్టువస్త్రాలు, పూజా సామగ్రి సమర్పిస్తున్న ఎరుకల సంధ్య రాందాస్ గౌడ్
విగ్రహ దాతగా నిలిచిన సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య
చిన్నకొండూరు భక్తి, సేవాభావం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దాతల సహకారంతో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎరుకల సంధ్య రాందాస్ గౌడ్ ప్రతిరోజూ అమ్మవారికి చీరలు, పూజా సామగ్రిని సమర్పిస్తూ ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ఆమె సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొస్తున్నారు. భక్తితో పాటు సేవాభావానికి ప్రాధాన్యమిస్తూ ఆమె అందిస్తున్న సహకారం స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి విగ్రహ దాతగా నిలిచారు. ఆయన అందించిన ఈ సహకారం గ్రామ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అమ్మవారి విగ్రహాన్ని సమకూర్చి ఆధ్యాత్మిక సంప్రదాయాలు కొనసాగేందుకు ఆయన కృషి చేయడం అభినందనీయమని భక్తులు కొనియాడారు. దేవాలయ అధ్యక్షుడు ఎరుకల రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. "అన్నదానం మహాదానం" అనే స్ఫూర్తితో దాతలు ముందుకు రావడంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగలిగామని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు, పేదలకు అన్నప్రసాదం అందించడం వల్ల సమాజంలో దాతృత్వ స్ఫూర్తి పెరుగుతుందని పలువురు పేర్కొన్నారు.అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి