Sthanikam - Truth Matters
Logo

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Updated : 18 Oct 2026 09:34 IST
As Preferred Source 1 min read
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యతకు ప్రతీక బతుకమ్మ: ఎస్పీ శరత్ చంద్ర పవార్.

నల్లగొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళా పోలీస్ సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సందడి చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ఆయన సతీమణి పూజా పవార్ ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళల ఐక్యతను చాటిచెప్పే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఆత్మీయత, సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి ఆనందాన్ని పంచుతాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పోలీసు కుటుంబాల సహకారం ఎంతో విలువైనది.

ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సందర్భాల్లో పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఎస్పీ అన్నారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులు అందించే సహకారం, చూపించే త్యాగాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీసు కుటుంబ సభ్యులంతా ఇలాంటి వేడుకల్లో కలిసిమెలిసి పాల్గొనడం వల్ల పరస్పర ఆత్మీయత, ఐక్యత మరింత బలపడతాయని తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఎస్పీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, మహిళా ఎస్‌ఐలు శ్రావణి, అమ్రీన్, మమత, సీఐ నాగరాజు, ఆర్‌ఐలు సంతోష్, సూరపు నాయుడు, కల్యాణ్ రాజ్, మహిళా పోలీస్ సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయ పాటలు, ఆటలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

Sthanikam

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి