నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో గల బోరంచ గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయంలో ఆదివారం విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పరికరాలకు పూజలు చేసి, సిబ్బంది భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు.గ్రామ ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు కలగకుండా,విద్యుత్ సరఫరా సజావుగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని సబ్స్టేషన్లో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
దసరా పండుగను పురస్కరించుకొని బోరంచ సబ్స్టేషన్లో పూజలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి