Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

దసరా సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ. సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్.

Updated : 18 Oct 2026 13:38 IST
As Preferred Source 1 min read
దసరా సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ.    సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్.

దసరా పండుగను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ దుస్తులు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున సిబ్బందికి ఈ కానుకలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా వంటి సేవల్లో గ్రామపంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ గ్రామ అభివృద్ధికి సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలను సమర్థవంతంగా అందించడంలో సిబ్బంది చేస్తున్న కృషిని గుర్తిస్తూ దసరా సందర్భంగా దుస్తులు, ఇతర వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, జువ్వ గోని మల్లమ్మ, మిర్యాల జగన్, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

దసరా సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ. సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్.

Article Image

దసరా పండుగను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ దుస్తులు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున సిబ్బందికి ఈ కానుకలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా వంటి సేవల్లో గ్రామపంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ గ్రామ అభివృద్ధికి సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలను సమర్థవంతంగా అందించడంలో సిబ్బంది చేస్తున్న కృషిని గుర్తిస్తూ దసరా సందర్భంగా దుస్తులు, ఇతర వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, జువ్వ గోని మల్లమ్మ, మిర్యాల జగన్, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి