సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ పెద్ద చెరువు కట్టపై నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల శనివారం రాత్రి పరిశీలించారు. చెరువు కట్టపై కాలినడకన తిరుగుతూ లైటింగ్ ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ఆరు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు, కళాకారులతో ఆటపాటల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణతో చెరువు పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్తో పాటు నాయకులు జార్జ్, అశోక్ రెడ్డి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మల
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి