Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గౌరమ్మ మృతి తీరని లోటు. భీష్మ రాజ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డి సంతాపం.

Updated : 18 Oct 2026 15:50 IST
As Preferred Source 1 min read
గౌరమ్మ మృతి తీరని లోటు. భీష్మ రాజ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డి సంతాపం.

మద్దూర్, అక్టోబర్ 18: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన జె. గౌరమ్మ (65) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం (అక్టోబర్ 19) ఖాజీపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబానికి అండగా ఉంటాం

గౌరమ్మ మృతి పట్ల భీష్మ రాజ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. గౌరమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భీష్మ రాజ్ ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గౌరమ్మ మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

Sthanikam

గౌరమ్మ మృతి తీరని లోటు. భీష్మ రాజ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డి సంతాపం.

Article Image

మద్దూర్, అక్టోబర్ 18: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన జె. గౌరమ్మ (65) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం (అక్టోబర్ 19) ఖాజీపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబానికి అండగా ఉంటాం

గౌరమ్మ మృతి పట్ల భీష్మ రాజ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. గౌరమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భీష్మ రాజ్ ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గౌరమ్మ మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news